Wednesday, January 30, 2008

మోహన్ బాబు -- ఆవు

మిత్రుడొకరు మోహన్ బాబు మీద పోస్ట్ చదివి "ఆవుమీద వ్యాసం" అంటే ఏమిటండీ అని ఫోన్ చేశారు. ఆయనకి వివరం చెప్పాను.స్కూలుపిల్లాడొకడు పరీక్షకెళ్తూ ఒకేఒక్క వ్యాసం చదువుకుని వెళ్ళాడట.అది ఆవు గురించి.తీరా పరీక్షలో విమానం మీద,రైలు మీదా వ్యాసం రాయమని అడిగారట. మనవాడికి ఆవు ఒక్కటే తెలుసు.ఇక వ్యాసపరంపర ఇలా సాగింది."విమానం గాలిలొ ఎగురుతుంది.దానికి రెక్కలుంటాయి.పైకి ఎగిరాక కిందకి చూస్తే పచ్చిక బయళ్ళు కనబడ్తాయి. అక్కడ గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." ఇలా మొత్తం ఆవుగురించే రాసేశాడు.

ఇక రైలు గురించి మొదలెట్టి " రైలు పట్టాల మీద నడుస్తుంది.దాని ఇంజన్ వెనక పెట్టెలుంటాయి. అందులో ఎక్కి వెళ్తుంటే పట్టాల పక్కన గడ్డిమేస్తూ ఆవులుంటాయి. ఆవు సాధుజంతువు. దానికి రెండు కొమ్ములుంటాయి.నాలుగు కాళ్ళుంటాయి.ఆవు పాలిస్తుంది. పేడ వేస్తుంది...." మళ్ళీ ఇదే సోది..ఎందుకంటే వాడికొచ్చింది అదొక్కటే గనుక. ఈవిధంగా తిరిగి తిరిగి మొదటికే వచ్చే జీడిపాకాన్ని "ఆవుమీద వ్యాసం" అని చిన్నప్పుడు నవ్వుకునేవాళ్ళం.

ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ప్రసిద్ధులయిన సినిమా వ్యక్తులు దాసరి నారాయణ రావు, ఆయన శిష్యుడు మోహన్ బాబు.

మోహన్ బాబు తీరు ఎలా ఉంటుందంటే....ఈ కింది ప్రస్తావనలు తప్పనిసరిగా ఉంటాయి.

1. అన్నయ్య (NTR)
2. మా గురువుగారు దాసరి
3. మా విష్ణు బాబు, మా మనోజ్ బాబు
4. మా పాప లక్ష్మీప్రసన్న
5. విద్యానికేతన్ కాలేజ్
6. ప్రజలే దేవుళ్ళు.
7. బాబా ఆశీస్సులు

ఒక కాలేజ్ వార్షికోత్సవంలో ఇలా ఉంటుంది ఆయన "ఆవుమీద వ్యాసం"

"ఈ కాలేజ్ పిల్లల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అన్నయ్యతో కలిసి 1995లో మేజర్ చంద్రకాంత్ షూటింగ్ సందర్భంగా ఫలానా కాలేజ్ కి వెళ్ళిన సంఘటన గుర్తొస్తున్నది. ఆ రోజే మా గురువుగారు దాసరిగారు కూడా ఇంకో ఫలనా కాలేజ్ లో షూటింగ్ కి వెళ్ళారు.మా విష్ణుబాబుని కూడా ఇదే కాలేజ్ లో చేర్పించి IPS చేయించాలి అనుకున్నాను. కానీ అభిమానుల (?) కోరికమేరకు సినిమాల్లోకి తెచ్చాను.మరి పాప లక్ష్మీప్రసన్న కూడా అమెరికాలో ఫలానా కోర్సు చేసింది.ఈ కాలేజ్ కూడా అచ్చం మా విద్యానికేతన్ కాలేజ్ లా ఉంది.అక్కడ 2 వేలమందికి చదువు చెబ్తున్నాం. అడ్మిషన్ ఫాంలో కులం పేరు అడగని ఏకైక కాలేజ్ మాదే. మరి దీన్ని లెజెండ్ అనరా ? ప్రజలే దేవుళ్ళు.వాళ్ళు చూస్తున్నారు.బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి. ఇక్కడున్న పిల్లలంతా నాలాగే మంచివాళ్ళు. మేము ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు... "

ఇంతవరకు ఏ తానా సభలకిగాని,ఆటా సభలకిగానీ ఆహ్వానం అందినట్లు లేదుగానీ, ఒకవేళ వస్తే గిస్తే ఆయన "ఆవుమీద వ్యాసం" ఇలా ఉంటుంది....

"ఇంతమంది ప్రవాసాంధ్రుల్ని చూస్తుంటే అన్నయ్య చెప్పినట్లుగా చేయెత్తి జైకొట్టు తెలుగోడా అనాలనిపిస్తుంది. మా గురువు దాసరి గారు ఇదేమాట అన్నారు. మీరంతా నాలాగే క్రమశిక్షణతో కష్టపడి పైకొచ్చినవాళ్ళు. మనం ఎవరికీ హాని చేసేవాళ్ళం కాదు. ఒకరిగురించి చెడుగా తలిచేవాళ్ళం కాదు.అసలు మా మనోజ్ బాబు అమెరికా వెళ్ళి IPS అవుతా నాన్నా అని అడిగాడు.కానీ, మళ్ళీ అభిమానుల వత్తిడికి తలొంచి సినీకళామతల్లికి నా జంటసింహాలను అంకితం చేశాను.మరి దీన్ని లెజెండ్ అనరా ? ఇక్కడ ఉన్న కొందరు NRIలు నన్ను అడిగారు. వాళ్ళ పిల్లలకి క్రమశిక్షణ నేర్పమని. మీ పిల్లల్ని హార్వర్డ్,స్టాన్ ఫర్డ్ లాంటి చోట్లకి కాకుండా మా విద్యానికేతన్ కి పంపండి అని చెప్పాను.ఏది ఏమయినా బాబా ఆశీస్సులు నాకు,నా కుటుంబానికి కావాలి......."

ఇదీ ఆయన వరస !

అది పరామర్శ అయినా, సంతాపం అయినా, వివాహం అయినా, రమ్యక్రిష్ణతో ఇంటర్వ్యూ అయినా..అన్నిటికీ మోహన్ బాబు గారిది ఒకటే మంత్రం !

ఇలా "ఆవుమీద వ్యాసం" మేధావుల వర్గంలో ఇద్దరు రాజకీయులు కూడా ఉన్నారు. ఎవరో ఊహించండి. వారిగురించి తదుపరి పోస్ట్ లో రాస్తా.

25 comments:

sivakasi said...

adhirindhi tapa

Arun said...

america velli IPS avuthaa nanna..ee sentence iragadeesindi KC garu. mee writing skills superb.

Vamsi M Maganti said...

ఆవు వ్యాసం అదిరిందండీ - నవ్వాపుకోలేక చచ్చాను...గాడిద వ్యాసం ఏమన్నా ఉందేమో చూడకపోయారా ?

Vamsi M Maganti said...

ఎంతో ఆసక్తిగా తదుపరి ఆవు వ్యాసం ఎదురుచూస్తూ

Srujana said...

కడుపు చక్కలు అయ్యెల నవ్వాను. సూపర్ గా రాసారు.

Nirmala said...

KC garu,

you have nice sense of humor and excellent writing skills. Your blog is very interesting.

Nirmala

vijju said...

super vundandi... hats off to your sense of humor....
vijju - vijjugadu.blogspot.com

sujatha said...

oh my god kc garu u r a wonderful person.mi sense of humour adhbutham ga undhi.people around u must be lucky.kadupu chekkalu ayyela navvamu nijamga.

Rajesh said...

mohanbabu mida intha satire rasi nannu tega navvinchinanduku meeku chala thanks KC garu

నాగరాజా said...

:)

Rama said...

మీరు రాసిన మోహన్(ఆవు)బాబు మీద వ్యాసం చాల బాగుందండి.. చదువుతుంటే అవును నిజమే కదా అనిపించేంత గొప్పగా వుంది... నాకెందుకో అశోకుడు చెట్లు నాటించేను అన్నది గుర్తొస్తోంది ... విద్యార్ధులకి కొద్దిరోజుల్లో మోహన్(ఆవు)బాబు విద్యానికేతన్ స్థాపించేను అనే పాఠం వచ్చినా మనము ఆశ్చర్యపోనవసరం లేదనుకొంట మన కేంద్రమంత్రి దాసరి పుణ్యమా అని..

రాధిక said...

:):):)

jags said...

super undi...:)

nagaprasad said...

బాబ్బాబు... త్వరగా ఆ రాజకీయనాయకులెవరో చెప్పు, తెలుసు కోవాలని చాలా ఆత్రుతగా ఉంది.

subha said...

mike dorikithe sontha dabba kottukuntarani baga chepparandi aavu vyasam dwara

Pavan Kommireddi said...

నూటికి నూరు శాతం నిజంగా ఇలాగే వాయిస్తాడు డప్పు...చితక్కొట్టేసారు మీ "ఆవు మీద వ్యాసం"...మీకు కూడా ఆ బాబా & అన్న ఎన్ టీ ఆర్ ల ఆశీశ్శులు ప్రాప్తించి ఒమేరికా లో IPS చెయ్యాలని కోరుకుంటున్నాను..

Budaraju Aswin said...

:-))

Cheekatiman said...

Dear KC Garu,

Chala Baga Rasarandi. Mohan Babu matladuthu unte some common dialogues, baba asirwadam, ANN garu, and Guruvu Garu.. Danini meeru Avu meeda vyasamu tho chala baga polcharandi.
Mee abbai/ammai USA lo IPS cheyalini anukontu inkonni mee blogs lo chudalani...
with best wishes
Subba.

నిషిగంధ said...

:) :) :)

Katam said...

KC garu...'mohanu'bh'aavu'di gurinchi 'yama'ha gaa raasaaru.Andukondi maa ee chinni 'Celebrity' satkaram ;-)

Katam said...

KC Garu..
'Mohan'ubh'aavu'di gurinchi 'Yama'ha gaa raasaaru.Meeku kudaa 'Celebrity' satkaaram cheyyaalsinde sumaa .. ;-)

KC Chekuri said...

Katam garu,

meeru nannu "celebrity" anadam dwara tidtunnatlugaa undi :-)

Anonymous said...

అంతా బాగుందన్నా గాని ఆవు వ్యాసం లో గేద గురించి తిడుతూ రాస్తే ఈంకా బాగుండేదేమో?

Umadevi said...

Adurs KC garu,

Chala kalam taruvata mana blog chustunnanu...I will send my contributions also when there is time...keep up the good work!

sri said...

:)))